రోజు ఉదయం చద్దన్నం తింటే.. 

Narender Vaitla

27 Aug 2024

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా చద్దన్నాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా చద్దన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ప్రోబయోటిక్స్  రోగ నిరోధక శక్తిని బలోపేతంలో చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ ఉదయం చద్దన్నం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది.

శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చద్దనం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ చద్దన్నం తింటే ఒత్తిడి దూరమవుతుందని అంటున్నారు.

చద్దన్నంలో యాండీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. ముడతలు, మచ్చలు ఏర్పడకుండా నిరోధిండచంలో సహాయపడుతుంది.

శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు, అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో చద్దన్నం ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు ఎంతో మేలు చేస్తాయి.

అల్సర్‌, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా చద్దనం మేలు చేస్తుంది. కడుపు చల్లబడి అల్సర్‌ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.