జీడిపప్పు మంచి కొవ్వులకు పెట్టింది పేరు. దీనికి కారణంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. హెచ్‌డీఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెరను గ్రహించే ప్రక్రియను నెమ్మదిస్తుంది
ఇక జీడిపప్పులో ఉండే ఫైబర్ కంటెంట్, ప్రోటీన్స్ త్వరగా కడుపు నింపిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు.
మెదడు ఆరోగ్యానికి కూడా జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జీడిపప్పులోని ల్యూటిన్, జీయాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. కంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని అందంగా కనిపించేలా చేయడంలో ఉపయోగపడుతుంది.
జీడిపప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ క్రమంతప్పకుండా జీడిపప్పు తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.