క్యారెట్స్ ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధిని పెంచుతుంది. దీంతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో వ్యాధుల బారిన పడడం తగ్గుతుంది.
రక్తపోటు సమస్యతో బాధపడే వారికి క్యారెట్ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
అందమైన జుట్టును సొంతం చేసుకోవాలంటే క్యారెట్ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, కెరోటినాయిడ్స్ వల్ల జుట్టు నల్లగా, నిగనిగలాడుతుంది, అలాగే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా క్యారెట్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
క్యారెట్ అనగానే విటమిన్ ఎ గుర్తొస్తుంది. అందుకే ప్రతీ రోజూ క్యారెట్‌ను తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపు మెరుగుపడుతుంది.
చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కూడా క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ చర్మం సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.