01 June 2024

అన్ని సమస్యలకు క్యారెట్ ఒక్కటి పరిష్కారం.. 

Narender.Vaitla

కంటి చూపు మెరుగుపడడంలో క్యారెట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ క్యారెట్‌ తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. ఇందులోని విటమిన్‌ ఏ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. 

చర్మ సౌందర్యాన్ని సంరక్షించడంలో కూడా క్యారెట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్స్‌లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్‌, పోషకాలు చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. క్యారెట్‌ జ్యూస్‌ తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.

 క్యారెట్లు ఫైబర్‌కు పెట్టింది పేరు. ఈ ఫైబర్‌ కంటెంట్‌ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీంతో మలబద్ధకం సమస్యను తగ్గించి గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు.

క్యారెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో అనే రకాల వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు.

రక్తపోటుతో బాధపడేవారికి క్యారెట్ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా లభించే మెగ్నీషియం కంటెంట్‌ రక్తపోటు నియంత్రిస్తుంది. రోజూ కచ్చితంగా క్యారెట్ తీసుకుంటే బీపీ కంట్రోల్‌ అవుతుంది. 

జుట్టు ఆరోగ్యాన్ని రక్షించడంలో క్యారెట్‌ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణలు చెబుతున్నారు. ఇందులోని విటమిన్లు, కెరోటినాయిడ్స్‌ వల్ల జుట్టు నల్లగా మారుతుంది, జుట్ట రాలడం తగ్గుతుంది.

 నిత్యం క్యారెట్ తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని పోషకాలు కాల్షియం శోషణను అధికం చేస్తాయి. దీంతో ఎముకలు, కీళ్లు బలంగా మారుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం