జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి యాలకులు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యల నుంచి బటయపడొచ్చు.
పురుషుల్లో వచ్చే సంతాన లేమి సమస్యలకు యాలకులు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే సినియోల్ అనే కాంపౌండ్… పురుషుల్లో నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది.
యాలకులతో చేసిన టీని ప్రతీరోజూ తాగితే ఒత్తిడి సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు ఒత్తిడిని దూరం చేస్తాయి.
ఆస్తమాతో బాధపడేవారికి కూడా యాలకులు ఉపయోగపడతాయి. కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, ఛాతిలో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలకు యాలకులు బాగా ఉపయోగపడతాయి.
యాలకుల్లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. పాలలో యాలకులు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
యాలకుల్లో మెగ్నీషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారికి కూడా యాలకులు ఉపయోగపడతాయి. భోజనం చేసిన తర్వాత ఇలాచీని నోటిలో వేసుకుంటే మంచి మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.