క్యాప్సికమ్‌తో కళ్లు చెదిరే లాభాలు.. 

Narender Vaitla

22 Aug 2024

క్యాప్సికమ్‌లో లైకోపీన్ అనే ఫైటోన్యూట్రియెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మెరుగైన జీర్ణక్రియకు క్యాప్సికమ్‌ దోహదం చేస్తుంది. ఇందులోని మంచి గుణాలు.. కొవ్వు కరిగించడంలో ఉపయోగపడతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

క్యాప్సికమ్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ న్యూట్రీషియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా గర్భాశయ, ప్రోస్టేట్, ప్యాంక్రియాస్, మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

క్యాప్సికమ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది వాపు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

నొప్పి తగ్గించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. క్యాప్సైసిన్ అనే సమ్మేళనం వెన్నుముక నొప్పిని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

క్యాప్సికమ్‌ రక్త హీనతతో బాధపడేవారికి కూడా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఔషధ గుణాలు.. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.