22 June 2024

క్యాబేజీ అనగానే ముఖం తిప్పేసుకుంటున్నారా.? 

Narender.Vaitla

మెరుగైన జీర్ణక్రియకు క్యాబేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇఇందులోని విటమిన్ ఎ, రిబోఫ్లేవిన్, ఫోలేట్, బి6లు, ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ సి గుండెను రక్షిస్తుంది.

క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని మంచి గుణాలు క్యాన్సర్‌ను దరిచేరకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

క్యాబేజీలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి క్యాబేజీని రెగ్యులర్‌ డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చు.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా క్యాబేజీ బెస్ట్‌ ఫుడ్‌గా చెప్పొచ్చు. క్యాబేజీని రెగ్యులర్‌గా తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

క్యాబేజీలో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి లోపల మచ్చలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శుక్లాలు రాకుండా రక్షిస్తాయి.

వయసు మళ్లిన తర్వాత వచ్చే అల్జీమర్స్‌ సమస్య నుంచి బయటపడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్‌ కే అల్జీమర్స్ సమస్యను దరిచేరకుండా చూస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.