02 June 2024

సొరకాయ అనగానే నో అంటున్నారా.? 

Narender.Vaitla

సొరకాయలో ఫైబర్‌ ఫుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి.

మూత్రాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి కూడా సొరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గుణాలు మూత్ర సంబంధిత సమస్యలకు చెక్‌ పెడుతుంది.

ఇక సొరకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. హైబీపీతో బాధపడేవారు రోజూ సొరకాయ తీసుకుంటే కచ్చితంగా మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బరవు తగ్గాలనుకునే వారికి కూడా సొరకాయ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. త్వరగా జీర్ణం కావడంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

మధుమేహంసమస్యతో బాధపడేవారికి కూడా సొరకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సొరకాయ జ్యూస్ రూపంలో తీసుకుంటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. 

లివర్‌ ఆరోగ్యాన్ని రక్షించడంలో సొరకాయ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లివర్ ఇన్ఫ్లమేషన్ సమస్య నుంచి బయటపడాలంటే కచ్చితంగా సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

సొరకాయలోని మంచి గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.