TV9 Telugu

4 April 2024

అబ్బే.. ఏం సొరకాయ అనుకుంటున్నారా.? 

సొరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు, మలబద్ధకం ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతంది. 

సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎండకాలం సొరకాయను ఆహారంగా తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. 

మూత్రాశయ ఇన్ఫెక్షన్‌ దరిచేరకుండా ఉండాలంటే సొరకాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జ్యూస్‌ రూపంలో తీసుకోవడం మరింత మంచిది. 

బరువు తగ్గాలనుకునే వారికి కూడా సొరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని పొటాషియం, ఖనిజాలు శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగించేస్తుంది.

ప్రతిరోజూ క్రమంతప్పకుండా సొరకాయ జ్యూస్‌ తీసుకుంటే బీపీ అదుపులోకి వస్తుంది. ఇందులోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది.

షుగర్‌ సమస్య ఉన్నవారు రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగుతుంటే షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అన్ని రకాల కాలేయ సమస్యలకు సొరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కాలేయంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.