TV9 Telugu

16 March 2024

చేదుగా ఉంటుంది.. కానీ.. 

కాకరకాయలో ఉండే పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ రక్కతంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోపడుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. 

జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కాకరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

విటమిన్లు, ఖనిజాలకు కాకారకాయ పెట్టింది పేరు. ఇందులో పొటాషియ, ఐరన్‌ శరీరానికి శక్తిని అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఇక కాకరకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తపోటును నయంత్రించి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరు కాకర. ఇందులోని ఈ గుణాలు శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. 

ఇక కాకరకాయను తరచుగా తీసుకోవడం వల్ల శ‌రీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జ్యూస్ రూపంలో తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. 

కిడ్నీలో రాళ్ల సమస్యలతో ఇబ్బందిపడే వారికి కాకరకాయ దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జ్యూస్‌ రూపంలో తీసుకుంటే రాళ్లు కరుగుతాయని చెబుతున్నారు. 

కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో కాకరకాయ ఉపయోగపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఇందులోని ఔషధాలు ఉపయోగపడతాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.