షుగర్ పేషెంట్స్‌కి బిర్యానీ ఆకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు బిర్యానీ ఆకుతో చేసిన టీని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గురకచ, ఛాతిలో మంట వంటి సమస్యలున్న వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
క్యాన్సర్ వంటి మహమ్మారికి చెక్ పెట్టడంలో బిర్యానీ ఆకు టీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటివి దరిచేరవు.
చుండ్రు, జట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఉడికించిన బిర్యానీ ఆకు నీటితో జుట్టు మూలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే స్కాల్ప్ ఆరోగ్యం ఉంటుంది.
బిర్యానీ ఆకు టీ తాగడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు బలోపేతమవుతుంది. దీంతో మెదడు ఆరోగ్య మెరుగవుతుంది. భవిష్యత్తులో వచ్చే అల్జీమర్స్ దూరమవుతుంది.
బిర్యానీ ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపులు, నొప్పులను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా బిర్యానీ ఆకుతో చేసిన టీ ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.