TV9 Telugu
28 March 2024
తమలపాకుతో ఎన్ని లాభాలో..
తమలపాకులో రోగ నిరోధక శక్తిని పెంచే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తమలపాకులో కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. దీంతో ప్రతిరోజూ తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి.
జీర్ణక్రియ మెరుగుపడడంలో కూడా తమలపాకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత తింటే అన్న జీర్ణమవుతుంది.
తమలపాలకులో కాపర్, ఐరన్, ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలనొప్పిని తగ్గించడంలో కీలక పత్ర పోషిస్తుంది.
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో తమలపాకు ఉపయోగపడుతుంది. ఒత్తిడి వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
అధిక రక్తపోటుతో బాధపడే వారు ప్రతీ రోజూ తమలపాకును తీసుకోవాలి. ఇందులోని మంచి గుణాలు బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
షుగర్ పేషెంట్స్‌కి కూడా తమలపాకు ఎంతగానో ఉపయోగడతాయి. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తమలపాకును తీసుకోవడం మంచిది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..