13 June 2024

బీన్స్ తింటే.. ఆ సమస్యలన్నీ బలదూర్‌. 

Narender.Vaitla

క్యాన్సర్‌ మహమ్మారిని నయం చేయడంలో బీన్స్‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులోని డైటరీ ఫైబర్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సమస్యకు చెక్‌ పెడుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బీన్స్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇది డైజెస్టివ్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుంది.

బీన్స్‌లో విటమిన్ కె, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైటెట్‌ కూడా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి బీన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యాలరీలు తక్కువ ఉండే ఆహారం బరువు పెరగకుండా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వ్యాధులను తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా బీన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంలో ఇందులోని విటమిన్ ఏ  యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు ఆహారంలో కచ్చితంగా బీన్స్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, లూటీన్,జియాన్తీన్ కంటి జబ్బుల నుంచి కాపాడుతుంది.

 మహిళల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా బీన్స్‌ ఉపయోగపడతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సక్రమంగా రాలేదని ఫిర్యాదుచేసే మహిళలకు ఇవి మంచి ఔషధంగా పనిచేస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.