15 July  2024

చిక్కుడు కాయ తింటే  ఏమవుతుందో తెలుసా.? 

Narender.Vaitla

చిక్కుడు కాయను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయేరియాకు చెక్‌ పెట్టొచ్చు.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా చిక్కుడు కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ త్వరగా కడుపు నిండిన భావవను కలిగిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చిక్కుడు కాయ కీలక పాత్ర పోసిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌ బీ1 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అలాగే చిక్కుడలో ఉండే విటమిన్ బి1 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించడంలో కూడా చిక్కుడు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు శ్వాసకోశ వ్యాధులకు చెక్‌ పెడుతుంది.

నిద్రలేమి సమస్యకు కూడా చిక్కుడు ఉపయోగపడుతుంది. ఇందులోని లభించే మాంగనీస్ రాత్రుళ్లు నిద్ర హాయిగా పట్టడానికి ఉపయోగపడుతుంది.

చిక్కుడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. దీంతో బీపీతో పాటు మానసిక సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి బీపీ ఉన్న వారు చిక్కుడు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.