20 June 2024

రోజూ బాస్మతి రైస్‌ తింటే.. ఏమవుతుంది.? 

Narender.Vaitla

గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంచడంలో బాస్మతి రైస్‌ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సంతప్త కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

బాస్మతి రైస్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి దీర్ఘకాలంలో వచ్చే పెద్ద పేగు క్యాన్సర్‌ వంటివి దరిచేరకుండా ఉండడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

బాస్మతి రైస్‌ బీ1, బీ6 పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని థయామిన్‌ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు బాస్మతి రైస్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

బాస్మతి రైస్‌లో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు హైపర్‌ టెన్షన్‌ను కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. పొటాషియం బీపీ కంట్రోల్‌కు సహాయపడుతుంది.

మంచి జీర్ణవ్యవస్థకు బాస్మతి రైస్‌ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి బాస్మతి రైస్‌ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగుతుంది. 

కీళ్ల సమస్యతో బాధపడుతున్న వారు బాస్మతి రైస్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా బాస్మతిని తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.