మానసిక ఆరోగ్యానికి అరటి పండు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియం, డోపమైన్ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక అరటి పండు పొటాషియంకు పెట్టింది పేరు ప్రతీ రోజూ క్రమంతప్పకుండా అరటి పండు తీసుకుంటే రక్తపోటు కంట్రోల్‌లోకి వస్తుంది.
బుతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొనే నొప్పికి కూడా అరటి సమర్థవంతంగా పనిచేస్తుంది. కడుపు నొప్పిని తగ్గించే గుణం ఇందులో ఉంది.
నిద్రలేమితో బాధపడేవారికి కూడా అరటి పండు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తింటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.
అరటిలోని దివ్య గుణాలు క్యాన్సర్ సమస్య తగ్గే అవకాశాలు తగ్గిస్తుంది. ముఖ్యంగా పిల్లలో వచ్చే ల్యుకేమియా సమస్యను దరిచేరనివ్వదు.
అరటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేవరు. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారు అరటి తీసుకుంటే సమస్య దూరమవుతుంది.
డయాబెటిస్ పేషెంట్స్‌కి కూడా అరటి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిండంలో కీలక పోషిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.