బేబీ క్యారెట్‌ను వారానికి మూడు సార్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మ కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయని పరిశోధనల్లో వెల్లడైంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో బేబీ క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
బేబీ క్యారెట్‌లోని కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ రక్షణతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులను దరిచేరనివ్వకుండా ఉంచడంలో ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
క్యారెట్లు కంటి ఆరోగ్యానికి మంచివని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బేబీ క్యారెట్‌తో మరింత ప్రయోజనం పొందొచ్చు. వయసుతో పాటు వచ్చే కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో బేబీ క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఒక్కటైన క్యారెట్‌ను నమలడం వల్ల పంటి సమస్యలు బలదూర్ అవుతాయి.
ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో బేబీ క్యారెట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని ప్రోటీన్స్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. విటమిన్ కే వంటి సమృద్ధిగా లభిస్తాయి.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతీ రోజూ కచ్చితంగా బేబీ క్యారెట్‌ను తీసుకోవాలి. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరకుండా చూస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.