యాపిల్‌ను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. హెలికోబాక్టర్ పైలోరీ అనే బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే గ్యాస్ట్రిక్ అల్సర్ జీర్ణాశయంలో కలిగే పుండు నుంచి కాపాడుతుంది.
చిన్నారులకు యాపిల్ ఎంతగానే మేలు చేస్తుంది. ముఖ్యంగా మెదడు తీరుని మెరుగుపరుస్తుంది, జ్ఞాపకశక్తి పెరగడంలో యాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది.
యాపిల్ తినడం వల్ల శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది. దీంతో గుండె పోటు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
యాపిల్‌లోని ఫైబర్ కంటెంట్ మలబద్దకం సమస్య దరిచేరకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఓ యాపిల్ తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
ఎముకలు దృఢంగా ఉండాలనుకునే వారు కచ్చితంగా ప్రతీ రోజూ ఒక యాపిల్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముకలను ధృడంగా మారుస్తుంది.
ఇక ఆస్తమా బాధితులకు కూడా యాపిల్ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆస్తమాను దరిచేరనివ్వవు.
క్యాన్సర్ మహమ్మారిని దరిచేరనివ్వకుండా ఉంచడంలో కూడా యాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.