23 June 2024

రోజుకో ఉసిరి తింటే..  ఏమవుతుందో తెలుసా.? 

Narender.Vaitla

రోజుకో ఉసిరిని తీసుకోవడం వల్ల షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌ పేషెంట్స్‌కి ఉసిరి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.

హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. గుండె కవాటాలు మూసుకుపోకుండా ఇందులోని క్రోమియం నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఉసిరి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది.

ఉసిరి ఫైబర్‌కు పెట్టింది పేరు. ప్రతీరోజూ ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు

ఉసిరిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ గ్లైసమిక్ గుణాలు రోగాల బారిన పడకుండా కాపాడుతుంది.

నిత్యం జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి ఉసిరికాయ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఉసిరికాయ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బటయపడొచ్చు.

 క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉసిరి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.