క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు ఆలీవ్ గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కీమోథెరపీతో మంచి కణజాలాలపై ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తుంది.
తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో కూడా ఆలీవ్ గింజలు ఉపయోగపడతాయి. కొత్తగా తల్లులు అయిన వారు, గర్భిణీలు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఆలీవ్ గింజలు బాగా సహాయపడతాయి. వీటిలోని ఐరన్, ఫోలికామ్లం, విటమిన్ 'ఎ', విటమిన్ 'ఇ', ఫ్యాటీ ఆమ్లాలు నిరోధక శక్తిని పెంచుతుంది.
జీర్ణక్రియ రేటును పెంచడంలో ఆలీవ్ సీడ్స్ బాగా ఉపయోపగడతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ రేటును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఆలీవ్ సీడ్స్ సహాయపడతాయి. మనసు బాగాలేప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు వీటిని తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు.
బరువు తగ్గాలనుకునే వారు ఆలీవ్ గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.