TV9 Telugu
26 March 2024
ఇంట్లో వాము ఉంటే..
ఆరోగ్యం ఉన్నట్లే.
అసిడిటీతో బాధపడే వారికి వాము దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీళ్లలో టీస్పూన్ వాము, జీలకర్ర వేసి మరగిస్తే అసిడిటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
గర్భిణీలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపుతో ఉన్న వారికి ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తి దూరమవుతుంది.
వామును నీళ్లలో వేసి మరిగించి ప్రతీ రోజూ పరగడుపున తాగితే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గొంతు నొప్పి కూడా దూరమవుతుంది.
నోటిని శుభ్రంగా ఉంచడంలో కూడా వాము ఉపయోగపడుతుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
వాము నూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. వాము నూనెను కీళ్ల నొప్పులున్న చోట రాస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపు తాగాలి. ఇలా చేస్తే.. అధిక బరువు, స్థూలకాలం వంటి సమస్యలు దరిచేరు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..