ఇంట్లో వాము ఉంటే.. ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే 

Narender Vaitla

07 October 2024

అసిడిటీతో బాధడేవారికి వాము ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో టీస్పూన్‌ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించి తీసుకుంటే అసిడిటీ దూరమవుతుంది.

వాములో నియాసిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోపడుతుంది. రోజూ పరగడుపు వాము నీటిని తాగితే మేలు జరుగుతుంది.

జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా వాము ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుంది.

దగ్గుతో బాధపడుతున్న వారు వామును తీసుకుంటే ఉపశనం లభిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ దగ్గును దూరం చేస్తాయి.

వామును నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. ఇది నేచురల్ మౌత్ ఫ్రెష్‌నర్‌గా ఉపయోగపడుతుంది.

ఇక నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే కడుపు నొప్పికి వాముతో చెక్‌ పెట్టొచ్చు. వేయించిన వామును పాలలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.

పంటి సంబంధిత సమస్యలు సైతం దూరం చేయడంలో వాము ఉపయోగపడుతుంది. వాము వేసి మరిగించిన నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పులు దూరమవుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.