ఇందులో క్లోరోఫిల్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. గోధుమ గడ్డిలోని ప్రధాన పోషకం క్లోరోఫిల్. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
TV9 Telugu
రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీర కణాల పునరుత్పత్తిలో గోధుమ గడ్డి రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గోధుమ గడ్డి రసం శరీరానికి శక్తిని అందిస్తుంది, అలసటను తగ్గిస్తుంది.
TV9 Telugu
గోధుమ గడ్డి రసం విటమిన్ A, C, E, K, B కాంప్లెక్స్ విటమిన్లతో పాటు మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.
TV9 Telugu
గోధుమ గడ్డిలోని యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలోని స్వేచ్ఛా రాశులను తొలగించి, కణాలకు హాని కలిగించకుండా కాపాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే గుణం ఉంది.
TV9 Telugu
గోధుమ గడ్డి రసం మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇందులోని పోషకాలు.. శరీరంలోని మలినాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది.
TV9 Telugu
గోధుమ గడ్డి జ్యూస్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కొవ్వు కూడా ఉండదు. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది.