సమ్మర్‌లో పుచ్చకాయతో ఎన్ని లాభాలో.. 

TV9 Telugu

26 February  2024

పుచ్చకాయలో ఎక్కువ నీరు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్‌లో తలెత్తే డీహైడ్రేషన్‌ సమస్యకు పుచ్చకాయతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి పుచ్చకాయ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో ఇది దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. 

కీళ్ల నొప్పులు, వాంతో ఇబ్బంది పడే వారికి పుచ్చకాయం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కొన్ని గుణాలు కీళ్ల నొప్పులకు చెక్‌ పెడతాయి. 

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి పుచ్చకాయ దివ్యౌషధంగా చెప్పాలి. బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ప్రతీ రోజూ పుచ్చకాయ జ్యూస్‌ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

రోగ నిరోధక శక్తిని పెంచడంలో పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ సీ శరీరాన్ని రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. 

ఇక పుచ్చకాయ కారణంగా గుండె పోటు సమస్య దరి చేరకుండా చూసుకోవచ్చు. పుచ్చకాయలోని గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

పుచ్చకాయతో మల బద్ధకం సమస్య కూడా దరి చేరదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో నీటి కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.