ముందుకేనా.. వెనకకు నడవటం కూడా మంచిదే...!

7 September 2023

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఓ గంట వాకింగ్‌ చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వడివడి అడుగులేస్తూ ముందుకేకాదు నెమ్మదిగానైనా వెనుకకు కూడా నడవాలంటున్నారు.

అదేంటి.. వెనుకకు నడవడం ఏంటీ అని అనుకుంటున్నారా? కాస్త నెమ్మదిగా అయినా సరే వెనక్కి నడవడం కూడా అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయంటున్నారు 

మరైతే ఎలా నడవాలి? ఎలాంటి లాభాలున్నాయి అని సందేహిస్తున్నారా? అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం.  ఎత్తుపల్లాలు లేని సురక్షిత ప్రదేశాన్ని ముందుగా ఎంచుకోవాలి. కంగారుపడకుండా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వెనక్కి నడవాలి

ఇలా క్రమంగా వేగాన్ని పెంచుకోవాలి. ఇలా రోజుకు కనీసం 10 నుంచి 20 నిముషాలపాటు నడవాలి. రోజూ నడవకపోయినా వారంలో కొన్ని రోజులైనా వెనుకకు నడవాలి

ఈ విధంగా వెనుకకు నడవడం పనికిమాలిన పనేంకాదు. అది మీ శరీరానికీ, మనసుకీ మధ్య సమన్వయం పెంచి.. విసుగు, కోపం వంటి వాటిని తగ్గించి మొత్తం మానసిక స్థితిని మెరుగుపడేలా చేస్తుంది.

ఆస్టియో ఆర్థరైటిస్‌, జువెనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారికి  కండరాలను బలోపేతం చేసి.. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనాన్నిస్తుంది.

ముందుకు నడవడం కంటే వెనకకు నడవడం వల్ల శక్తి 40శాతం ఎక్కువగా ఖర్చవుతుంది. ఫలితంగా వేగంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

వేగంగా వెనకకు అడుగులు వేయటం వల్ల పాదాల కండరాలు బలోపేతమవుతాయి. ఎక్కువ కెలొరీలు ఖర్చు అవడమేకాకుండా జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. జీవక్రియ కూడా మెరుగవుతుంది.