రాగులని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా ఉన్నారు. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిల్లెట్స్ని తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గించడం నుంచి బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం వరకూ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
రాగులని మొలకెత్తించి తినడం వల్ల ముఖ్యంగా, ఎముకలు, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో కూడా హెల్ప్ చేస్తాయి. మొలకెత్తిన రాగులని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎవరైనా మిల్లెట్స్‌ని ఆహారంగా తీసుకుంటే వారికి పోషకాలు లభిస్తాయి.
మిల్లెట్స్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో రాగులు తినడం మంచిది.
రాగుల్లోని శీతలీకరణ గుణం వేసవి తాపాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇది షుగర్ ఉన్నవారికి బెస్ట్ ఫుడ్. దీని వల్ల రక్తంలో చక్కెరని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది.
షుగర్ ఉన్నవారికి రాగుల మొలకలు ఓ వరమనం చెప్పొచ్చు. ఇందులో పాలిఫెనాల్స్, డైటరీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి, ఇది షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంలో మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
రాగుల్లోని పీచు రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది. దీంతో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కాబట్టి, కచ్చితంగా షుగర్ ఉన్నవారు రాగి మొలకల్ని తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది.
మొలకెత్తిన రాగుల్ని తీసుకుంటే రక్తహీనత సమస్య దూరమవుతుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సాయపడుతుంది. మిల్లెట్స్‌ని ఆహారంలో చేర్చుకోవచ్చు. రక్త ప్రసరణ పెరుగుతుంది.
హై కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో స్ప్రౌటెడ్ మిల్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. రెగ్యులర్‌గా రాగుల మొలకల్ని తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఇందులో అమైనో యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడంలో సాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.