ముల్లంగిలో మనకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!
Jyothi Gadda
27 May 2024
ముల్లంగిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కలిగి ఉన్నాయి. జలుబు, డయాబెటీస్, నోటి సమస్యలు, మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ముల్లంగిని సమయం ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గ్యాస్ట్రిక్ వంటి ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం పదండి.
ముల్లంగిని ఎప్పుడు తినాలి.. పొద్దున్నే పరిగడుపున వీటిని ఎట్టి రిస్థితిలో తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత లేదంటే భోజజం చేసేకంటే ముందే ముల్లంగిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
అయితే ఈ ముల్లంగి కూరను ఎక్కువగా మధ్యాహ్న సమయంలోనే తింటుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం.. ఈ కూరతో పాటుగా పచ్చి కూరగాయలను కలిపితే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముల్లంగిని ఎలా తీసుకోవాలి.. ముల్లంగిని సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ముల్లంగితో పాటుగా క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో, దోసకాయను సలాడ్ గా చేసుకుని తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు.
సన్నగా ఉండే ముల్లంగిలు తియ్యగా ఉంటాయి. వీటిని పై తొక్క తీసేసి తింటే జీర్ణక్రియ ఆరోగ్యం బాగుంటుంది. అయితే ముల్లంగిని తిన్నవెంటనే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయకండి. వీటిని తిన్న తర్వాత కాసేపు నడిస్తే.. అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.
రాత్రిపూట ముల్లింగిని తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఒకవేళ తీసుకున్నారో.. కడుపులో గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. బాడీ పెయిన్స్ ఉన్నవారు ముల్లంగిని తీసుకోవడం మానేయాలి. లేదంటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
ముల్లంగితో ఇతి తీసుకోకూడదు.. ముల్లంగిని పాలు, కీరదోస, నారింజ, కాకరకాయతో కలిపి ఎట్టి పరిస్థితిలో తినకూడదు. వీటిని తినాలంటే ముల్లంగిని తిన్న తర్వాత అర్థగంట సమయం తర్వాతే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.