గర్భిణీలు దానిమ్మ రసం తాగితే.. లాభమా, నష్టమా.? 

TV9 Telugu

15 February  2024

దానిమ్మ అందరిలాగే గర్భిణీలకు కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దానిమ్మ రసంతో గర్భిణీలకు మేలు జరుగుతుంది. 

పిండం మెదడు ఎదుగుదలను దానిమ్మం రసం ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. కడుపులో బిడ్డ సేఫ్‌గా ఉంటుంది.

ఇంట్రాఇటేరియన్‌ గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌ అని పిలిచే సమస్య దరి చేరకుండా ఉండడంలో దానిమ్మ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

అలాగే పిండానికి ఆక్సిజన్‌ అందించడంలో కూడా దానిమ్మ ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని పాలీ ఫినాల్స్‌ మేలు చేస్తాయి. 

ఉమ్మనీటిలో తేడాలుంటే వచ్చే ఐయూజీఆర్‌ సమస్యకు దానిమ్మ రసంతో చెక్‌ పెట్టొచ్చని వైద్య నిపునులు చెబుతున్నారు.

ఐయూజీఆర్‌ సమస్యలు ఉన్న కొందరు గర్భిణీలను ఎంచుకొని వారిపై పరిశోధనలు చేపట్టిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు.

దానిమ్మ రసం తీసుకున్న గర్భిణీలకు జన్మించే పిల్లల మెదళ్లలోని కనెక్షన్లు బలంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పుట్టబోయే పిల్లల మానసిక స్థితిపై దానిమ్మ ప్రభావం చూపుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.