10 June 2024

పైనాపిల్ తీసుకోకపోతే..  చాలా మిస్‌ అవుతారు.

Narender.Vaitla

పైనాపిల్‌ మాంగనీస్‌కు పెట్టింది పేరు. ప్రతీరోజూ పైనాపిల్‌ను క్రమంతప్పకుండా తీసుకుంటే ఎముకలు పటిష్టంగా మారుతాయి. కీళ్లనొప్పులు తగ్గుతాయి.

దంత సమస్యలకు పైనాపిల్ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్‌ తాగడం వల్ల దంతాలు పటిష్టంగా మారుతాయి.

కంటి ఆరోగ్యానికి కూడా పైనాపిల్ మేలు చేస్తుంది. ఇందులోని బీటాకెరోటిన్‌ కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునే వారికి పైనాపిల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు కూడా పైనాపిల్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఫైబఱ్‌ కంటెంట్‌ జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

పైనాపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగవుతుంది. దీంతో జుట్టు, గోళ్ల ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు.

పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడ్ఎంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.