రోజు ఒక పల్లిపట్టి తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Jyothi Gadda

17 September 2024

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతి రోజు పల్లిపట్టి తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఎముకలను దృఢంగా చేస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. 

ముఖ్యంగా పల్లీలో ఉండే ప్రోటీన్‌ శరీర నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. పల్లిపట్టిలో పుష్కలంగా కేలరీలు, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిచేందుకు పనిచేస్తాయి.

వ్యాయామాలు చేసేవారు ప్రతి రోజు వీటిని తినడం వల్ల ఖండరాలు మెరుగుపడతాయి. పల్లిపట్టిలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.

పల్లిపట్టిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచి, అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. దీంతో పాటు అనేక పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.

పల్లిపట్టిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా రక్తహీనత వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు గర్భిణీ స్త్రీలకు ఈ పల్లిపట్టిలు ఎంతగానో మేలు చేస్తాయి.  

పల్లిపట్టిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా చేస్తుంది. మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. 

పల్లిపట్టిలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా వాటి ఆరగడాన్ని తగ్గిస్తుంది. మానసిక సమస్యలను తగ్గిస్తుంది.