తాటికల్లు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం వంటిది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
చెట్టు నుండి అప్పుడే తీసిన తాటికల్లులో మన శరీరానికి అవసరమయ్యే 18 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని పరిశోధనల్లో తేలిందని సమాచారం.
తాటి కల్లులో విటమిన్ సి, బి ఉన్నాయి. ఇవి కంటిశుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
తాటి కల్లులో ఉండే పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తాటి కల్లులో ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నాయి. ఇది చర్మం, గోళ్లు, జుట్టుకు కూడా మంచిది.
అంతేకాదు..తాటికల్లుకు క్యాన్సర్ కారక కణాలను నశింపజేసే శక్తి కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తాటి కల్లులో పెక్టిన్ ఉంటుంది. ఇది మలబద్ధకం, ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులకు తాటికల్లు యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది
తాటికల్లులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి పురోగతిని తగ్గించడానికి, ఆపడానికి సహాయపడుతుంది. కల్లుకంటే ముందుగా తయారయ్యే నీరాను తీసుకోవడం మరింత మంచిది.
నీరాను సూర్యోదయానికి ముందే తీస్తారు. కాబట్టి ఇందులో ఉండే సహాజ గుణాలైన చక్కెరలు అలాగే ఉంటాయి. దీని వల్ల కామెర్లు, టైఫాయిడ్, విరేచనాలు, వాంతులవంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. కానీ, కల్లు అలా కాదు. కల్లులో ఆల్కహాల్ ఉంటుంది.