TV9 Telugu

13 May 2024

ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలతో.. ఇన్ని లాభాలా 

పైనాపిల్‌లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రమంతప్పకుండా పైనాపిల్ తీసుకుంటే వ్యాధుల బారిన తక్కువ పడతారు. 

బరువు తగ్గాలనుకునే వారికి కూడా పైనాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసే వారు పైనాపిల్ తీసుకుంటే మేలు జరుగుతుందని చెబుతున్నారు.

ఇక పైనాపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బు వంటి సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైబీపీకి చెక్‌ పెట్టవచ్చని అంటున్నారు.

కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు కూడా పైనాపిల్ దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని బ్రొమెలనిన్‌ ఎంజైమ్‌ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది.

చర్మానికి కూడా పైనాపిల్ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలతో మన శరీరానికి రోజుకు అవసరమైనంత మ్యాంగనీసు లభిస్తుంది.

కంటి చూపును మెరుగుపరచడంలో కూడా పైనాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో అధికంగా ఉండే బీటా కెరోటిన్ , విటమిన్ సి కంటి చూపును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

పైనాపిల్‌లో పుష్కలంగా ఉండే మాంగనీస్‌ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు ఎముక సంబంధిత లోపాలను సరిదిద్దడంలో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.