ఈ ఆకుతో 300 వ్యాధులకు చెక్.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Jyothi Gadda

26  May 2024

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి. ఈ చెట్టు కాయలతో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. అయితే.. మునక్కాయలే కాకుండా.. దాని ఆకుల్లోనూ అద్భుతమైన హెల్త్​ బెనిఫిట్స్​ఉన్నాయి. 

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అమృతంలా పరిగణిస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుందట! దీని ఆకులు, కాడలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. 

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మునగను పోషకాల పవర్​హౌజ్ అంటారు.

మునగాకు రసం ఒక స్పూన్​ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్లలో కలిపి కొద్దిగా తేనె కలిపి తాగితే విరేచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోయి.. ముఖం అందంగా తయారవుతుంది.

గుప్పెడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించి.. ఆ నీరు చల్లారినతర్వాత అందులో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.

ఈ ఆకులు ఊబకాయం, బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పరగడుపున ఈ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్​కంట్రోల్ అవుతుంది.

ప్రతిరోజూ మునగాకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మునగ ఆకులను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అల్సర్ వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు.

ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచి, ఆరోగ్యకరమైన ప్రేగు కదలికకు కూడా దోహదపడుతుంది. ఇది రక్తహీనతను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అంటే ఎర్ర రక్త కణాల లోపాన్ని నివారిస్తుంది.