పుట్టగొడుగులు తింటే ఎలాంటి రోగమైనా పరార్ అవ్వాల్సిందే..!!
Jyothi Gadda
16 October 2024
పుట్టగొడుగులు, మష్రూమ్స్ రెండూ ఒక్కటే. శాఖాహారులు ఇష్టపడే మాంసాహారం ఇది. వీటిలో మాంసాహారంలో లభించే ప్రొటీన్లన్నీ లభిస్తాయి. దీనిని సూపర్ ఫుడ్ అంటారు.
ఎన్నో ఏండ్లుగా మష్రూమ్స్ ను ఆహారంలోనూ, ఔషధాల్లోనూ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు వీటిని రెగ్యులర్ గా డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పుట్టగొడుగుల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి. క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరకుండా కాపాడుతాయి.
పుట్టగొడుగులు రుచికరమైన, పోషకమైన శిలీంద్రాలు. వీటిని శాఖాహారులు ఇష్టంగా తింటుంటారు. నిత్యం ఆహారంలో పుట్టగొడుగులు చేర్చుకుంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి.
కొత్త అధ్యయనం ప్రకారం బలహీనమైన జ్ఞాపకశక్తి, భాష సమస్యలు, అభిజ్నా బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి.
లయన్స్ మేన్ మష్రూమ్..ఒక రకమైన పుట్టుగొడుగు. ఇది నరాల కణజాలాల ఉత్పత్తిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి, మొద్దుబారిన మెదడు, వయస్సు సంబంధిత మానసిక రుగ్మతల నుంచి కాపాడుతుంది.
ఇందులో ఉండే లినోలిక్ యాసిడ్ యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండ్ గా పనిచేస్తుంది. శరీరంలో అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు హానికరమైన ప్రభావాలను తొలగిస్తుంది. రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.