దొండకాయ తింటే జ్ఞాపకశక్తి తగ్గుతుందని దాన్ని తినడం పూర్తిగా మానేశారా? దొండకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదలిపెట్టరని నిపుణులు అంటున్నారు.
TV9 Telugu
దొండకాయలో ఫైబర్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి , క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
TV9 Telugu
దొండకాయను ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.
TV9 Telugu
దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. షుగర్ బాధితులు వారంలో ఒక రోజు దొండ కాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా మంచిది.
TV9 Telugu
దీనిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో థయామిన్ అనేది ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మారుస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ సజావుగా జరుగుతుంది.
TV9 Telugu
అల్సర్లు, గ్యాస్ వంటి సమస్యలను దొండకాయ దూరం చేస్తుంది. దీనిలో సమృద్ధిగా బీటా కెరోటిన్ లభిస్తుంది. అది విటమిన్ ఏగా మారి దృష్టి లోపాలను సరిచేస్తుంది.
TV9 Telugu
బరువు తగ్గాలని అనుకునే వారికి దొండకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. జీవక్రియ రేటును పెంచి కొవ్వు కణాలను కరిగిస్తుంది.
TV9 Telugu
ఐరన్ లోపంతో బాధ పడేవారు దొండకాయ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది అనీమియా సమస్యతో బాధ పడే వారికి చక్కగా పని చేస్తుంది.