రోజూ రాత్రిళ్లు 7 గంటలకు భోజనం చేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

22 October 2024

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యకరమైన శరీరానికి సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో వేళకు తినడం కూడా అంతే ముఖ్యం. అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకు సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి

TV9 Telugu

కానీ నేటి కాలంలో జీవనశైలి చాలా అధ్వాన్నంగా మారింది. దీంతో చాలా మంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. ఇది ఊబకాయం, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది

TV9 Telugu

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం.. మధ్యాహ్నం భోజనానికి బదులు చిరుతిళ్లతో కాలం గడిపేయడం, ఇక రాత్రిళ్లు కూడా ఆలస్యంగా భోజనం చేయడం వంటివి తరచూ చేస్తే ఆరోగ్యం వేగంగా పాడవుతుంది

TV9 Telugu

అందుకే మంచి ఆరోగ్యం కోసం రాత్రిళ్లు ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య భోజనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి ఏడు గంటలకు నిత్యం రాత్రి భోజనం చేస్తే ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలిస్తే రోజూ ఆశ్చర్యపోతారు

TV9 Telugu

రాత్రి సమయంలో ప్రతి రోజూ ఏడు గంటలకు ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే సమతుల్య ఆహారం మాత్రమే తీసుకోవాలి

TV9 Telugu

సాయంత్రం ఏడు గంటలకు రాత్రి భోజనం చేస్తే నిద్రపోయే సమయానికి ఆహారం బాగా జీర్ణమై చాలా తేలికగా అనిపించడంతోపాటు అజీర్ణం, బరువు, మలబద్ధకం మొదలైన సమస్యలు దరిచేరవు

TV9 Telugu

సాయంత్రం ఏడు గంటలకు ఆహారం తీసుకోవడం ద్వారా, రాత్రిళ్లు నిద్ర కూడా బాగా పడుతుంది. ఎందుకంటే ఇది శరీరానికి జీర్ణక్రియకు తగినంత సమయం ఇస్తుంది

TV9 Telugu

రాత్రి ఏడు గంటలకు డిన్నర్ తింటే, ఉదయం బద్ధకంగా అనిపించకుండా ఎనర్జీతో మెలకువ వస్తుంది. మూడ్ కూడా మెరుగవుతుంది. అంతేకాడు హార్మోన్లు (ఇన్సులిన్, కార్టిసాల్) సమతుల్యంగా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది