చియా సీడ్స్‌తో బోలెడు బెనిఫిట్స్..! మర్చిపోకండి

Jyothi Gadda

04 October 2024

చియా సీడ్స్ ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు కలిగివున్నాయి.. వీటిలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఈ గింజలు చూసేందుకు చిన్నగా ఉన్నప్పటికీ బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి.

చియాసీడ్స్‌లో కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కొవ్వు, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. బరువు తగ్గేలా చేస్తాయి.

చియా విత్తనాల్లో ఫైబర్ ప్రోటీన్, ఒమేగా – త్రీ ఫ్యాటీ యాసిడ్లతో పాటు అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. బరువు తగ్గడం కోసం చాలా మంది చియా సీడ్లను తింటూ ఉంటారు.

నలుపు, తెలుపు రంగులో ఉండే ఈ చియాసిడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధిస్తాయి. అంతేకాకుండా వీటితో అనేక ప్రయోజనాలు ఉంటాయి. 

చియా విత్తనాల్లోని క్యాల్షియం ఎముకలకు మంచి బలాన్ని ఇస్తాయి. రక్తంలో చక్కెరను కూడా ఇవి నియంత్రిస్తాయి. చియా విత్తనాల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్ బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. 

రోజుకు 28 గ్రాముల చియా విత్తనాలు తీసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. అంటే రోజుకు రెండు, మూడు టీ స్పూన్లు విత్తనాల తీసుకున్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి.

గుండె ఆరోగ్యం, కిడ్నీ, లివర్, చర్మ, జుట్టు ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బీపీ కూడా నార్మల్ అవుతుంది.