తామర గింజల్లో సోడియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యానికి, జీర్ణక్రియకు అద్భుతంగా పని చేస్తాయి. తామర గింజలను పచ్చిగా గానీ, వేయించి గానీ తినేయొచ్చు
తామర గింజలు క్రమం తప్పకుండా తినడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం పొడిబారకుండా నిత్యం యవ్వనంలా నిగనిగలాడుతుంది. చర్మానికి మెరుపును ఇస్తుంది
తామర గింజల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది. మలబద్దకం, జీర్ణసమస్యలు వంటి రుగ్మతలు ఉంటే వెంటనే తామర గింజలను తీసుకోవడం ఉత్తమం
తామర గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా దొరుకుఉతంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఆక్సిజన్‌ను అందించి గుండె సంబంధ రోగాలను అరికట్టడానికి సాయపడుతుంది.
తామర గింజల్లో ఉండే ఆల్కలాయిడ్స్, సపోనిన్, గల్లిక్ యాసిడ్ వంటి ఫైటోన్యూట్రియెంట్‌లు శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడతాయి. కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
తామర గింజలను భోజనం మధ్యలో అల్పాహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. గ్లూటెన్ అలర్జీని అరికడుతుంది.
సంతానలేమితో బాధ పడుతున్న మహిళలు తామర గింజలను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుదంటున్నారు. పురుషుల శీఘ్రల స్ఖలనాన్ని నివారిస్తుంది. వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తాయి.
తామర గింజలు షుగర్ పేషెంట్లకు దివ్యౌషధం. రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రిండంలో తామర గింజలు అద్భుతంగా పని చేస్తాయి.
రోజుకు 25 గ్రాముల తామర గింజలు తీసుకోవడం వల్ల నిద్రలేమి, గుండెదడ, చికాకు తదితర సమస్యలను నివారించవచ్చని ఆయుర్వేధ నిపుణులు భరోసా ఇస్తున్నారు.
తామర గింజలను పొడిగా చేసుకుని వాడుకోవచ్చు. పప్పులు, సోయాబీన్, సజ్జ, జొన్న మొదలైన వాటితో తామర గింజలను కలిపి పొడి చేసుకుంటే పోషకాల విలువ మరింత పెరుగుతుంది.