అలాగే క్యాల్షియం, జింక్, బి6, డి, ఇ, కె వంటి విటమిన్లు కూడా కోడిగుడ్లలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఎదిగే పిల్లలకు కోడిగుడ్డు తప్పనిసరిగా ఇవ్వాలి
గుడ్డులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాల దృఢత్వానికి, ఎత్తు పెరిగుదలకు సహాయపడతాయి
గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుడ్డులో అధిక మొత్తంలో ఉంటాయి. అలాగే కోడిగుడ్డులో లభించే ఫోలేట్ పుట్టుకతో వచ్చే వ్యాధులను నివారిస్తుంది
గుడ్డులో ఉండే పెప్త్టెడ్స్ వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజూ గుడ్డు తినే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 24 శాతం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి
గుడ్డులో ఉండే కోలిన్ అనే పదార్థం మెదడు, నాడీ మండలాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఒక నార్మల్‌సైజు గుడ్డులో 20 శాతం వరకు కోలిన్ లభిస్తుంది
గుడ్డులో విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మధుమేహం, ఎముకలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అర్థమైందా గుడ్డు తినడం ఎంత ముఖ్యమో..