పచ్చి టమాటల్లో విటమిన్ సి, ఎ, కె, ఐరన్, పోటాషియం, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, జింక్, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే పోషకాల స్టోర్ హౌజ్
అంటారు.
పచ్చి టమాటల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
పచ్చి టమాటల్లో లైకోపీన్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఎర్రని టమాటల్లో కంటే వీటిల్లో ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది ప్రొస్టేట్, స్టమక్, స్కిన్.. వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టమాటల్లో పుష్కలంగా ఉండే విటమిన్లు, మినరల్స్.. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయంటున్నారు నిపుణులు.
అంతేకాదు.. టమాట జ్యూస్‌ని స్కిన్‌కి అప్లై చేయడం వల్ల సన్‌బర్న్ నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. కణజాల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పచ్చి టమాటలు తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ రోగులు మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. ముఖ్యంగా వీటిలో ఉండే లైకోపిన్, ఫైబర్.. వంటి పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, మంటను తగ్గిస్తాయి.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు 12 వారాల పాటు రోజుకు రెండు పచ్చి టమాటాలు తిన్న తర్వాత వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చి టమాటాలతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
గ్రీన్ టమాటల్లో ఉండే పొటాషియం, లైకోపీన్ సాధారణ రక్తపోటు స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.. ముఖ్యంగా పొటాషియం శరీరం నుంచి అదనపు సోడియంను తొలగించి రక్తపోటును తగ్గిస్తుంది.