రోజూ ఒక ఆరెంజ్ తినండి.. ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చో చూడండి!!
Jyothi Gadda
30 August 2024
ఆరెంజ్ ఒక రుచికరమైన, పోషకాలతో నిండిన పండు. ఆరెంజ్ పోషక విలవులు, ఇది గుండెకు అలాగే రక్తపోటు ఎలా సహాయపడుతుంది అనే విషయాలు గురించి తెలుసుకుందాం.
ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి అనారోగ్య సమస్యల బారిన పడకుండా సహాయపడుతుంది. అంతేకాదు, ప్రతిరోజు ఆరెంజ్ తినడం గుండెకు మంచిది.
నారింజలో విటమిన్ సితో పాటు ఫోలేట్, పొటాషియం, ఫైబర్, క్యాల్షియం వంటి ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
నారింజలో విటమిన్ సితో పాటు ఫోలేట్, పొటాషియం, ఫైబర్, క్యాల్షియం వంటి ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్‌లోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియ వ్వవస్థకు ఎంతో సహాయపడుతుంది. క్యాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.
ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరెంజ్‌లోని విటమిన్ సి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరెంజ్‌లోని పొటాషియం సోడియం ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. పొటాషియం రక్తనాళాలను విశ్రాంతి చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది.
ఆరెంజ్‌లోని మెగ్నీషియం గుండె స్పందన రేటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఆరెంజ్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు, కానీ ఇది ఒకే చికిత్స కాదు.