వారానికి ఎన్నిసార్లు చేపలు తింటే మంచిది..?

Jyothi Gadda

09 July 2024

చేపల కూర అంటే చాలామందికి ఇష్టం. నాన్ వెజ్ ప్రియులు ముఖ్యంగా చేపలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే చేపలు తినడం వల్ల కలిగే లాభాలు, వారానికి ఎన్నిసార్లు చేపలు తినాలో తెలుసుకుందాం

చేపల్లో మంచి కొవ్వు ఉంటుంది. అది శరీరానికి చాలా అవసరం. చేపల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన గుండెకు హార్ట్ ఎటాక్స్ రాకుండా కాపాడతాయి. మన శరీరంలో ఫ్యాటీ యాసిడ్స్ తయారు కాకుండా చూస్తుంది.

కడుపులో మంటలు, వేడి తగ్గాలంటే చేపలు తినాలి. కీళ్లనొప్పికి చేపలు సరైన మందు. ఇవి నొప్పిని తగ్గించి, కండరాలకు శక్తిని ఇస్తాయి. డిప్రెషన్, అల్జీమర్స్, డైమెన్షియా, మతిమరపు లాంటి లక్షణాల్ని చేపలు తగ్గిస్తాయి.

చేపల్లోని మెగ్నీషియం, మన బాడీలోనూ ఉంటుంది. అది సరిపడా లేకపోతే చాలా ఇబ్బంది. కాల్షియం మెటబాలిజంను సెట్ చెయ్యడానికి మెగ్నీషియం అవసరం. కాల్షియం వల్లే ఎముకలు బలంగా ఉంటాయి.

చేప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్ ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది శరీరం సులభంగా గ్రహించబడుతుంది. వీటితో పాటు చేపలలో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి.

ఎముకల్ని గట్టిగా చేసే విటమిన్-D చేపల్లో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్, పేగుల్లో క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఒయిసోఫాగస్ వంటి క్యాన్సర్లకు చేపలు చెక్ పెడతాయి. టైప్-1 డయాబెటిస్‌తో బాధితులు చేపలు తింటే మంచిది. 

చేపల్లోని పొటాషియం,కణాలు బాగా పనిచేసేలా చేస్తుంది. తద్వారా గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ, మెదడు సమస్యల నుంచీ బయటపడవచ్చు. పొటాషియం తగ్గితే హైబీపీ, కిడ్నీలో రాళ్లు, ఎముకలు పగులుతాయి. 

ఎనర్జీ ఇచ్చే చేపల్లోని ఐరన్, రక్తంలో హిమోగ్లోబిన్‌ సరిపడా ఉండేలా చేస్తుంది. పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేస్తుంది. శరీర వేడిని సరిచేస్తుంది. చేపల్లోని జింక్.. ఇమ్యూనిటీని పెంచుతుంది.