చద్దన్నం లాభాలు తెలిస్తే మెతుకు వదలకుండా తినేస్తారు..!

Jyothi Gadda

21 October 2024

చద్దన్నం మన భారతీయ వంటకాల్లో ప్రాచీనమైన, ఆరోగ్యకరమైనది. ప్రధానంగా అన్నాన్ని నీటిలో నానబెట్టి లేదా ఉడికించి తయారు చేస్తారు. ఇది సాదాగా, సులభంగా తయారయ్యే ఆహారం. 

చద్దన్నం మన భారతీయ వంటకాల్లో ప్రాచీనమైన, ఆరోగ్యకరమైనది. ప్రధానంగా అన్నాన్ని నీటిలో నానబెట్టి లేదా ఉడికించి తయారు చేస్తారు. ఇది సాదాగా, సులభంగా తయారయ్యే ఆహారం. 

ఉద‌యాన్నే చ‌ద్దన్నం,పెరుగు క‌లుపుకుని తింటే రక్తహీనతను దూరం చేస్తుంది. చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి.

చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది వ్యాధుల నుండి రక్షించుకోవడంలో సహాయపడుతుంది.

జొన్న చద్దన్నంలో మధుమేహం, ఊబకాయం నియంత్రణకు చాలా మంచిది.  బ్రౌన్ రైస్ చద్దన్నంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

రాగి చద్దన్నంలో అధిక ఆకలిని నియంత్రిస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అరికెల చద్దన్నం వల్ల మూత్రపిండ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడుతుంది.

చద్దన్నం తినడం మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చద్దన్నంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, చర్మం ముడతలు, మచ్చలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.