డ్రై ఆప్రికాట్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

1 December 2023

గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉండే ఈ పండులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఇతర కెరొటీనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

మాక్యులర్ డిజేనరేషన్, కంటి శుక్లం వంటి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆప్రికాట్లు అద్భుతంగా పని చేస్తాయి. 

ఆప్రికాట్లో ఉండే ఫైటోకెమికల్స్‌ వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి. వీటిని తాజాగా తినడమే కాదు డ్రై ఫ్రూట్స్ గా కూడా చేసుకుని తింటారు. 

ఒక కప్పు ఎండిన ఆప్రికాట్ లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు సహకరిస్తుంది. 

ఐరన్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. రక్తహీనత సమస్యల నుంచి బయట పడేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రేగులను శుభ్రం చేస్తుంది.

ఎముకలు ధృడంగా తయారవుతాయి. వృద్ధాప్యచాయలను దరిచేరకుండా చేస్తుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

ప్రతి రోజూ ఒకటి, రెండు డై ఆప్రికాట్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇవి వంటలలో రుచిని పెంచుతాయి. విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.