లవంగాలు, యాలకులు కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? 

27 October 2024

TV9 Telugu

TV9 Telugu

భారతీయుల ఇళ్లలో సుగంధ ద్రవ్యాలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. వాటిల్లో లవంగాలు, యాలకులు.. ముఖ్యమైనవి. ఈ రెండూ ఆహారం రుచితో పాటు పోషకాలను కూడా పెంచుతాయి

TV9 Telugu

లవంగం, ఏలకులలో మాంగనీస్, విటమిన్ K, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు లవంగాలలో అధిక  పరిమాణంలో ఉంటాయి

TV9 Telugu

ముఖ్యంగా మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రొటీన్, ఫైబర్, రిబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు కూడా ఏలకులు, లవంగాలలో కనిపిస్తాయి

TV9 Telugu

లవంగాలు, ఏలకులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్య ఉంటే, ఖచ్చితంగా ఈ రెండు పదార్థాలు కలిపి తీసుకోవాలి. ఇవి మలబద్ధకం నివారణలో మేలు చేస్తాయి

TV9 Telugu

లవంగాలు, ఏలకులు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని వల్ల కాలేయం, మూత్రపిండాలు, పేగుల్లో పేరుకుపోయిన మురికి తేలికగా తొలగిపోతుంది

TV9 Telugu

నోటి దుర్వాసనను తొలగించడంలో నోటి వాసన: లవంగం, ఏలకులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఏలకులు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. క్యావిటీస్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది

TV9 Telugu

అలాగే లవంగాలు, ఏలకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీరు పదే పదే అనారోగ్యానికి గురవుతుంటే.. లవంగాలు. ఏలకులను కలిపి తీసుకోవచ్చు

TV9 Telugu

లవంగాలు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటినొప్పి వంటి సమస్యలు నయం అవుతాయని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి