అందుకే.. వేసవిలో మట్టి కుండలో నీళ్లే మంచివట!

April 01, 2024

TV9 Telugu

మట్టికుండలోని నీరు వేసవిలో దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలామంది తమ ఇళ్లలో ఫ్రిజ్‌ ఉన్నప్పటికీ ఓ మట్టి కుండ ఉంచుకుంటారు

ఫ్రిజ్‌ వాటర్‌కి బదులుగా మట్టికుండలో నిల్వ చేసిన నీటిని తాగుతూ మండే వేసవిలో దాహార్తిని తీర్చుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి కుండలోని నీళ్లే ఎందుకు మంచిది అంటే..

వేసవిలో బాగా చల్లగా ఉండే నీరు తాగాలనిపించడం సహజం. అలాగే ఫ్రిజ్‌లోని నీళ్లు కూడా చల్లగానే ఉన్నా ఆ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు

ఫ్రిజ్‌లోని నీరు మరీ చల్లగా ఉండటం వల్ల సున్నితమైన గొంతు తట్టుకోలేదు. ఫలితంగా గొంతునొప్పి, జలుబు, దగ్గు.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా జరగకూడదంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం మంచిది

మట్టి ఎన్నో ఖనిజ లవణాలు ఉంటాయి. వాటిల్లో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎనర్జీ ఉంటుంది. ఇలాంటి మట్టితో తయారుచేసిన కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి

ఈ నీటిని తాగడం వల్ల వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్‌ కాకుండా కాపాడుకోవచ్చు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీరు తాగడం మంచిదట

బయటికి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్‌ బాటిల్‌కి బదులుగా మట్టితో తయారుచేసిన బాటిల్స్‌ని వెంట తీసుకెళ్లమంటున్నారు నిపుణులు. ప్రస్తుతం మట్టితో తయారుచేసిన టెర్రకోటా బాటిల్స్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి