ఎముకలకు పుష్టినిచ్చే పెరుగు తింటున్నారా?

April 15, 2024

TV9 Telugu

ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా! అయితే ఈ సమయంలో శీతల పానియాలు, ఐస్‌క్రీంలకు బదులు ఓ కప్పు పెరుగు తినండి

పెరుగు ఒంటికి చలవ చేయడమే కాదు. మహిళలకు మరెన్నో రకాలుగానూ మేలూ చేస్తుందట. కప్పు పెరుగులో రెండు చెంచాల ఓట్స్‌ వేసి రాత్రంతా నాననివ్వాలి

ఉదయాన్నే ఇందులో కాస్త పంచదార, చిటికెడు ఉప్పు కలిపి తింటే వేడి తగ్గడమే కాదు.. ఒత్తిడీ, రక్తపోటూ అదుపులో ఉంటాయి. అలాగే రోజూ పెరుగు తింటే.. శరీరానికి తగినంత కాల్షియం అంది ఎముకలు దృఢంగా మారతాయి

రోజూ పెరుగు తినడం వల్ల మెనోపాజ్‌ తరవాత మహిళలు ఆస్టియో పోరోసిస్‌ సమస్య బారిన పడకుండా ఉంటారు. పెరుగులోని మేలు చేసే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది

పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి  మలబద్ధకాన్ని అదుపులో ఉంచుతుంది

పెరుగు రోజూ తీసుకుంటే ఇందులోని ప్రోబయోటిక్స్‌ మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను తగ్గించి, రక్త సరఫరాను సమన్వయం చేస్తాయి

శరీరాకృతిని చక్కగా ఉంచేందుకు వ్యాయామాలు చేసేవారు పెరుగు రోజూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే ప్రోటీన్లు మంచి ఫలితాన్నిస్తాయట

కడుపునొప్పితో సహా ఇతర ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా పెరుగుని తక్షణ చికిత్స కోసం ఉపయోగించవచ్చు. డయేరియాని కూడా నయం చేస్తుంది. నెలసరి సమయంలో పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి