ప్రాణాలను నిలబెట్టే పవిత్ర తులసి! ఖాళీ కడుపుతో ఇలా తీసుకుంటే..
Jyothi Gadda
28 August 2024
తులసి నీరు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి.
ప్రతిరోజు పరగడుపున తులసి నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. తులసి నీరులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
తులసి నీరు రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనారోగ్యకరమైన వైరస్‌లతో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది.
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు పరగడుపున తులసి నీరు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. మలబద్ధకం, గ్యాస్, ఆల్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి కూడా తులసి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. దీని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఎలాంటి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
మైగ్రేన్ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ తులసి నీరు తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. తలనొప్పికి గొప్ప ఔషధం. తులసి నీరు శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది. విషతుల్యతను తొలగిస్తుంది.
తులసి నీరు తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, మనోధైర్యాన్ని పెంచుతుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు కూడా తులసి నీరు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
తులసి నీటి తయారీ కోసం ఒక గ్లాసు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి, రాత్రిపూట నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.