పచ్చి బొప్పాయిలో ఉన్న సీక్రెట్స్..? తెలిస్తే అమ్మో అనాల్సిందే..!

Jyothi Gadda

30   May 2024

బొప్పాయిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి అంటు వ్యాధులు, అనారోగ్యాలతో పోరాడటంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బొప్పాయి అద్భతంగా పనిచేస్తుంది.

ఫైబర్, డైజెస్టివ్ ఎంజైమ్ లకు మంచి మూలం.  బొప్పాయిని అల్పాహారంగా తీసుకుంటే బరువు బాగా తగ్గుతారు. బొప్పాయిని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండిన ఫీలింగ్‌ కలిగి ఉండి, పదేపదే తినకుండా ఉంటారు. 

అయితే పండిన బొప్పాయినే కాదు పచ్చి బొప్పాయి, వాటి ఆకులలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల పచ్చి బొప్పాయి ముక్కలను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. 

పచ్చి బొప్పాయి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలోని పోషకాల వల్ల నెలసరి సమస్యలు ఉండవు బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను రాకుండా బొప్పాయి కాపాడుతుంది. డెంగ్యూతో బాధపడే వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే సైటో టాక్సిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.

ఎవరికైనా గాయాలు అయితే ఆ గాయాలపై బొప్పాయి గుజ్జును రాయడం వల్ల కూడా గాయాలు త్వరగా నయం అవుతాయి.పచ్చి బొప్పాయిలో సపోనిన్, బీటా కెరోటిన్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, లైకోపీన్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

పచ్చిబొప్పాయిలో విటమిన్ సి, ఎ, ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఖనిజాలు అధికం. బొప్పాయిలో కేలరీలు తక్కువ, ఫైబర్ , యాటీఆక్సిడెంట్లు ఎక్కువ. పచ్చి బొప్పాయి జీర్ణక్రియకు సహాయపడుతుంది. అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

బొప్పాయిలోని విటమిన్ సి, ఇ చర్మాన్ని రక్షిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. పచ్చి బొప్పాయిలో ఉండే ఫైబర్ , పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది.