రోజూ పరగడుపున ఓ వెల్లుల్లి రెబ్బ తిని చూడండి? డాక్టర్‌తో పనే ఉండదు

01 August 2024

TV9 Telugu

TV9 Telugu

లేత పసుపు రంగులో, ఘాటుగా ఉండి వంటకాలకు మరింత రుచిని అద్దే వెల్లుల్లి దాదాపు ప్రతి ఇంటి వంట గదిలో ఉంటుంది. రుచికే కాదు ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు అందిస్తుంది

TV9 Telugu

ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో వెల్లుల్లిని అధికంగా ఉపయోగిస్తారు. కానీ చాలా మంది వీటిని పచ్చిగాకూడా తింటారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1 పచ్చి వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట

TV9 Telugu

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, జలుబుతో బాధపడేవారు ఇలా రోజూ ఉదయం ఓ వెల్లుల్లి తింటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది

TV9 Telugu

అల్లిసిన్ రక్తప్రవాహంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల అధిక రక్తపోటు సమస్య ఉండదు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

TV9 Telugu

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో వెల్లుల్లికి మించిన ప్రత్యామ్నయం మరొకటి లేదు. పైగా మంచి కొలెస్ట్రాల్‌నూ పెంచుతుంది

TV9 Telugu

వెల్లుల్లి శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి నిర్విషీకరణలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

వెల్లుల్లి జీర్ణక్రియకు సహకరిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, పెద్దప్రేగు శోథ, అల్సర్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి

TV9 Telugu

వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఎముకల క్షీణతను నివారించే శక్తి దీనికి ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మకాంతిని పెంచుతాయి